అదానీ గ్రూప్ సంస్థలపై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ ఐదు నెలల కిందట వెలువరించిన నివేదికపై గౌతమ్ అదానీ మరోసారి స్పందించారు. లాభాలు ఆర్జించాలనే వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అదానీ గ్రూప్ ప్రతిష్ఠను దిగజార్చాలనే తప్పుడు సమాచారాన్ని హిండెన్ బర్గ్ వండివార్చిందని దుయ్యబట్టారు. ఈ మేరకు వాటాదారులకు ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు. అదానీ గ్రూప్ దేశంలోనే అతిపెద్ద ఫాలో ఆన్ పబ్లిక్ … FPOకు వెళ్లిన వేళ హిండెన్ బర్గ్ సంస్థ ఈ నివేదిక వెలువరించిందన్నారు. సంస్థను అప్రతిష్ఠ పాల్జేసేందుకు తప్పుడు, చౌకబారు ఆరోపణలు చేసిందని విమర్శించారు. ఈ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీ స్టాక్ ధరలు ప్రభావితం అయ్యాయని, ఎఫ్ పీఓను అర్ధంతరంగా ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇన్వెస్టర్లకు సొమ్మును తిరిగిచ్చేశామన్నారు. షార్ట్ సెల్లర్ నివేదికతో కంపెనీ అనేక ప్రతికూల పరిణామాలూ ఎదుర్కోవాల్సి వచ్చిందని వార్షిక నివేదికలో అదానీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ సైతం అదానీ గ్రూప్ కంపెనీలు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తేల్చినట్లు తెలిపారు. కమిటీ సమర్పించిన నివేదిక మదుపరుల్లో విశ్వాసం నింపడానికి దోహదపడిందన్నారు. మోసపూరిత లావాదేవీలు, స్టాక్ ధరల తారుమారు వంటి అవకతవకలకు అదానీ గ్రూప్ సంస్థలు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ సంస్థ ఆరోపించింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్లు భారీగా పతనం అవ్వడమే కాకుండా రాజకీయంగానూ దుమారం రేగింది
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Adani’s Scathing Take on Hindenburg Report | Calls it ‘Targeted Misinformation’ to Earn Profits